అందరూ బావుండాలనే ఫిలాసఫీ ముందెట్టుకుని తన గేమేదో తను ఆడేస్తున్న కామెడీ మాస్టర్ బాబా భాస్కర్ ఇప్పుడు బిగ్‌బాస్ హౌసుకి కెప్టెనయ్యాడు. వేచిచూసే ఓపిక వున్నవారికి పదవులూ వస్తాయ్.. గౌరవాలూ లభిస్తాయ్.. అనడానికి బాబాభాస్కరే ఎగ్జాంపుల్. హౌసులో పిచ్చపిచ్చ కామెడీ చేస్తూ బీబీ సీజన్ 3 కే హైలైట్‌గా నిలిచిన బాబాభాస్కర్.. చాలా ఓపిగ్గా వుంటాడు. మ్యాక్సిమమ్ అందరితోనూ కలిసే వుంటాడు. కాకపోతే.. ఆమధ్య అలీభాయ్‌తో కాస్త తేడా వచ్చింది. అలీ కెప్టెన్‌గా వున్నప్పుడు తనని వెన్నుపోటు పొడిచినట్టుగా తెగ ఫీలయిపోయాడు. మరిప్పుడు తన టైమ్ వచ్చింది. అలీపై పగ తీర్చుకుంటాడా? పట్టించుకోకుండా వదలేస్తాడా? ఒక కంటెస్టెంటుగా చాలా జాగ్రత్తగా, కామెడీ టచ్ ఇస్తూ స్ట్రాటజీ ప్లే చేస్తున్న బాబాజీ ఈ గేమ్ ఎలా ముందుకు తీసుకుపోతాడా అనేది చూడాలి.
ఇక, బీబీ హౌసు బాగా బోరుకొడుతోందని నెటిజెన్లు తిట్టుకోవడం మొదలయ్యింది.చూడ్డానికి అక్కడ అంత సీన్లే లేవు. ప్రస్తుతం హౌసులో మొగుడూ పెళ్లాల మధ్య వార్ నడుస్తోంది. అంతే. మొగుడూ పెళ్లాల గొడవల్లో ఎవరూ వేలు పెట్టకూడదు కానీ, బిగ్‌బాస్ పెట్టాడు. వాళ్ల కలహాల్ని పెంచి పోషిస్తున్నాడు. చూస్తుంటే.. వరుణ్ అండ్ వితికా మధ్య ఈ బీబీ అయ్యేలోపు పెద్ద గొడవే జరిగేట్టు వుంది.
విచిత్రం ఏంటంటే.. వితికా అంతేడుస్తున్నా. లేడీస్స్ ఏంటండీ… వరుణ్‌కి సపోర్టు చేస్తున్నారు..? వరుణ్ వితికా తగువుల్లో వితికాదే తప్పంటూ నెటిజెన్లు చీల్చి చెండాడేస్తున్నారు.
‘టైం స్పెండ్ చేయి.. టైం స్పెండ్ చేయి అంటే ఎలా? ఏం మాట్లాడుతున్నావ్ అసలు. మనం వచ్చింది బిగ్ బాస్ షోకి.. హనీమూన్‌కి కాదు. అది నీకు అర్ధం అవుతుందా’ అని అన్నాడండి వరుణ్. అంతే! వితికాకి కోపం వచ్చేసింది. ఈమధ్య వరుణ్ వ్యవహారశైలితో ఆగ్రహంతో వున్న వితికాని తను మళ్లీ వచ్చి రెచ్చగొట్టాడు. కూల్ చేయాల్సింది పోయి హర్ట్ చేశాడు. వితికా ఊరుకుందేంటి? తను కూడా ఫైరైపోయింది. వరుణ్‌పై గట్టిగానే అరిచింది.
అలా ఇద్దరి మధ్య కయ్యాలు పెరిగాయ్. వితికా తట్టుకోలేక బాత్రూమ్‌కి వెళ్లి వెక్కి వెక్కి ఏడ్చేసింది. వరుణ్ వెనకే వచ్చి కూల్ చేయడానికి ట్రయ్ చేశాడు. అడుసు తొక్కనేల.. కాళ్లు కడగనేల… అని.
ఇంకోపక్క.. రాహుల్ అండ్ పునర్నవీ మధ్య ఏదో జరుగుతోందని అందరూ అనుకుని దిష్టి పెట్టారో ఏమో… ప్రస్తుతం వారిద్దరి మధ్యా కలహాలు ముదిరాయ్.
అక్కడేం జరిగిందంటే.. జైల్లో ఉన్న రవి, రాహుల్ దగ్గరకి పలకరించడానికి వెళ్లింది పునర్నవి. వాళ్ల మధ్య వితికా అండ్ వరుణ్ టాపిక్ వచ్చింది. వితికాని ఉద్దేశించి రాహుల్ ‘అది పిచ్చిది అలానే మాట్లాడుతూ ఉంటుంది’ అనేశాడు. దాంతో రాహుల్ మీద అలిగింది నవీ. హర్టయి అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఇంతుల మధ్య బాధ ఇంతింత కాదని తెలుసుకోలేకపోవడమే రాహుల్ చేసిన తప్పు… అంటూ నెటిజెన్లు ఆడుకుంటున్నారు.