కాంగ్రెస్ సీనయర్ నేత వీహెచ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నేతలు వీర్ సావార్కర్ ను ప్రమోట్ చేస్తున్నారని, ఆయన బ్రిటీష్ వాళ్లకు సహకరించాడని అన్నారు. స్వాతంత్ర్య ఉద్యమంలో బ్రిటీష్ వాళ్లతో కాంప్రమైజ్ అయ్యాడని, వీర్ సావర్కర్ బ్రిటీష్ వారికి ఏజెంట్ గా పనిచేశాడని వీహెచ్ వ్యాఖ్యానించారు.
ఇక బీజేపీ ప్రభుత్వం నెహ్రూ చరిత్రను కనుమరుగు చేసే ప్రయత్నం చేస్తుందన్నారు. బ్రిటీష్ వాళ్లతో పోరాడిన వారు దేశ భక్తులా.. లేక బ్రిటీష్ వాళ్లకు లొంగి పనిచేసిన వీర్ సావర్కర్ దేశ భక్తుడా అని ఆయన ప్రశ్నించారు. వీర్ సావర్కర్ కు భారతరత్న ఇవ్వాలనే ప్రయత్నం చేస్తున్నారని, ఇది సరికాదన్నారు వీహెచ్.
దేశంలో చరిత్రను మార్చే ప్రయత్నం చేస్తున్న బీజేపీ కుట్రలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన అన్నారు. బీజేపీలో ఎవరూ స్వతంత్ర సమరయోధులు లేరని, టిప్పు సుల్తాన్ వారసులను దేశం నుంచి వెళ్లగొట్టాలని అంటూ కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు అనడం దుర్మార్గమన్నారు. రాముడిని పూజించే వాళ్లే దేశంలో ఉండాలని చెప్పడం సరికాదన్నారు. బీజేపీ నాయకులు అదానీ గురించి ఎందుకు మాట్లాడరని వీహెచ్ ప్రశ్నించారు.