Veera Simha Reddy: సంక్రాంతి పండుగకు రిలీజ్ అయిన నట సింహం నందమూరి బాలకృష్ణ సినిమా ‘వీర సింహారెడ్డి‘ జనాలను బాగా ఆకట్టుకుంటోంది. భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. అలాగే యూఎస్ లో కూడా రికార్డులు సాధించింది. మంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది వీర సింహారెడ్డి. అయితే ఈ సినిమాలో బాలయ్య బాబు చెప్పిన డైలాగులు హాట్ టాపిక్ అవుతున్నాయి. మాటల రచయిత బుర్రా సాయి మాధవ్ రాసిన ఈ డైలాగుల్లో అధిక భాగం పొలిటికల్ పంచులతో నింపేశారు అని అంటున్నారు.

ఈ డైలాగులు వెండి తెర మీద బాలయ్య పాత్ర ద్వారా వస్తున్నపుడు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాలో జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా డైలాగులు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. నేరుగా వైసీపీ ప్రభుత్వాన్ని గురి పెట్టినట్లుగా ఈ డైలాగులు ఉన్నాయని అంటున్నారు. ఇందుకు సంబంధించిన డైలాగులు కూడా సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతున్నాయి.
దీంతో వీర సింహారెడ్డి సినిమా డైలాగులపై జగన్ ప్రభుత్వం అసహనం వ్యక్తం చేస్తోంది. అంతేకాకుండా విజయవాడలో శుక్రవారం కొందరు అధికారులు ఈ సినిమా చూశారని టాక్ వచ్చింది. జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా డైలాగులు ఉన్నాయని నిర్ధారణకు వచ్చిందట సర్కార్. డైలాగులు ఎందుకు వాడారో తెలుసుకోవాలని అధికారులకు సూచనలు చేసిందట జగన్ సర్కార్.
వీర సింహారెడ్డి డైలాగులు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఏం చేయాలనే అంశంపై ఏపీ ప్రభుత్వం తర్జన భర్జన అవుతోందట. మరి ఈ సినిమాపై జగన్ సర్కార్ ఎలాంటి చర్యలు తీసుకుంటుదో చూడాలి.’అభివృద్ధి అంటే కూల్చుడు కాదు నిర్మాణాలు’, అలాగే ‘ఒక్క సంతకంతో బోర్డులు మార్చవచ్చు కానీ చరిత్రను మార్చలేరు’ అని బాలయ్య చెప్పిన డైలాగ్స్ కూడా బాగా పేలుతున్నాయి.