బాలయ్య ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ సినిమాల్లో తొడగొట్టి ఈలలు వేయించాడు.గొడ్డలిపట్టి హిట్లు కొట్టాడు. ఫ్యాక్షన్ కు కొన్నాళ్ళు విరామం ఇచ్చాడు. మళ్ళీ ఇన్నాళ్ళకు ప్రేక్షకుల కోరికమేరకు వీరసింహా రెడ్డిగా కత్తిపట్టాడు. దర్శకుడు గోపిచంద్ మలినేని తెరకెక్కించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా రాబోతోంది.
ఈ నేపథ్యంలో శుక్రవారం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. అలాగే ట్రైలర్ ని కూడా విడుదల చేశారు. అందులో డైలాగులు ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌను, టాక్ ఆఫ్ ద పాలిటిక్స్ గా మారాయి. ఏపీ సర్కార్ పైన, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పైన పరోక్షంగా వేసిన పంచుల గురించి జనం చర్చించుకుంటున్నారు.
Also Read: బాబీ బ్యాక్ గ్రౌండ్ తెలుసా…? ఈ స్టార్ ప్లేయర్ అతని మరదలే…!
కొన్ని నెలల క్రితం వైఎస్ జగన్ ప్రభుత్వం ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్చింది. చాలా ఏళ్ల నుండి ఉన్న ఎన్టీఆర్ పేరును తీసేసి మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు పెట్టారు. అప్పట్లో ఈ విషయం గురించి టీడిపి బాగానే నిరసన వ్యక్తం చేసింది. కానీ ప్రభుత్వం ఏమాత్రం తగ్గలేదు.
ఈ నేపథ్యంలో వీర సింహారెడ్డి సినిమాలో దానిమీద కౌంటర్ ఉంది అని గత కొన్ని రోజులుగా లీకులు వచ్చాయి. ఆ లీకులను నిజం చేస్తూ, “సంతకాలు పెడితే బోర్డు మీద పేరు మారుతుందేమో, కానీ ఆ చరిత్ర సృష్టించిన వాడి పేరు మారదు, మార్చలేరు” అనే డైలాగ్ తో పరోక్షంగా పంచ్ వేశాడు బాలయ్య.
దాంతోపాటు “పదవి చూసుకొని మీకు పొగరేమో, బై బర్త్ నా డీఎన్ఏకే పొగరెక్కువ” అని మాటల తూటా వదిలారు. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి పేరు ఆ ఈవెంట్లో ప్రముఖంగా వినిపించింది. కార్యక్రమం విజయవంతం జరగడానికి ఆయన సహకారం అందించారని దర్శకుడు గోపీచంద్ మలినేని ధన్యవాదాలు కూడా చెప్పారు.
ఒంగోలు ప్రాంతానికి చెందిన గోపీచంద్ మలినేని తన సొంత జిల్లాలో సినిమా ఫంక్షన్ పెట్టుకోవాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నారు. ఈ క్రమంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా ఫైనల్ గా సాధించారు. అయితే దీని వెనుక బాలినేని సాయం ఉందని అంటున్నారు. అయితే సినిమాల్లో వైఎస్ఆర్సీపి నాయకుల్ని పరోక్షంగా విమర్శిస్తూ, ఇలా నేరుగా పార్టీని రిక్వెస్టులు చేయడం ఏంటో అర్థం కావడం లేదు అని నెటిజన్లు అంటున్నారు.
Also Read: పవిత్ర లోకేష్ బ్యాక్ గ్రౌండ్ తెలుసా…? ఆమె ఫస్ట్ పెళ్లి ఎవరితో అంటే…!