‘ఆలయం’ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది హనీ రోజ్. అయితే ఈ చిత్రం పెద్దగా గుర్తింపును తెచ్చిపెట్టలేదు. ఆ తర్వాత బాలయ్య బాబు ‘వీర సింహారెడ్డి’ మూవీతో ఒక్కసారిగా సాలిడ్ క్రేజ్ సంపాదించుకుంది. ఈ సినిమాతో హనీ రోజ్ పేరు మార్మోగిపోతోంది. సినిమా ఆఫర్ల సంగతేమో కానీ.. సోషల్ మీడియాలో మాత్రం ఆమెకు విపరీతంగా ఫాలోయింగ్ పెరిగిపోయింది. టాప్ యాడ్స్ బ్రాండ్స్ అయితే ఆమె వెనకాలే క్యూ కట్టేశాయి. రీసెంట్ గానే ఆమె హైదరాబాద్ లో ఒో రెస్టారెంట్ ని కూడా ఓపెన్ చేసింది.
లేటెస్ట్ గా ఆమె పెళ్లిపై చేసిన కామెంట్స్ తో మరోసారి టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచింది. విజయవాడలో ఓ బేకరీ ఓపెనింగ్ వెళ్లిన ఈ బ్యూటీ.. అక్కడ ఫ్యాన్స్ తో ముచ్చటించింది. ఈ క్రమంలోనే తాను ‘పెళ్లికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. పెళ్లి అనేది ఓ పెద్ద బాధ్యత.. వివాహ బంధం బలంగా ఉండటం కోసం నేను ఏమైనా చేస్తా’.. అంటూ చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ.
అంటే హనీ పెళ్లి చేసుకునేందుకు రెడీ అని చెప్పకనే చెప్పేసింది. అంతేకాకుండా సినిమాలు మానేయడానికి కూడా సిద్ధంగానే ఉన్నట్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. ఈ కామెంట్స్ తో అక్కడున్న ఆమె ఫ్యాన్స్ అంతా షాక్ కి గురయ్యారు.
అయితే తనకు కాబోయే వరుడు మాత్రం ఎలా ఉండాలి? అతనిపై తన అంచనాలు ఏమిటి? అనే విషయాల్ని మాత్రం రివీల్ చేయలేదు. అలాగే పెళ్లికి రెడీగానే ఉన్నానని చెప్పింది కానీ.. ఎప్పుడు చేసుకుంటానన్నది మాత్రం సస్పెన్ష్ లో ఉంచింది. తాజాగా ఈ బ్యూటీ చేసిన కామెంట్స్ తో ఆలోచనలో పడ్డారు ఫ్యాన్స్.