సంక్రాంతి బరిలో నిలిచిన రెండు భారీ చిత్రాల్లో వీర సింహారెడ్డి ఒకటి. అభిమానులు ఎంతగానో ఎదరు చూసిన ఈ చిత్రం గురువారం పెద్ద ఎత్తున రిలీజైంది. విడుదలైన ప్రతి చోట కూడా హౌస్ ఫుల్ బోర్డులు పడ్డాయి.
అఖండ అందించిన భారీ విజయం తరువాత బాలకృష్ణ, క్రాక్ చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్న గోపిచంద్ మలినేని… ఇద్దరు తీసిన సినిమా కావడంతో భారీ అంచనాల నడుమ సినిమా విడుదలైంది.
మొదటి రోజు మిక్డ్స్ రివ్యూలు తెచ్చుకున్నప్పటికీ.. టాక్ తో సంబంధం లేకుండా ఓపెన్సింగ్ భారీ స్థాయిలో రాబట్టింది. ఈ సినిమా మొదటి రోజే రూ.29 కోట్ల షేర్‌ను సాధించి సంచలనం సృష్టించింది. బాలయ్య కెరీర్‌లో హైయెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టిని మూవీగా నిలిచింది. అంతేకాకుండా ‘ఆర్‌ఆర్‌ఆర్’, ‘సర్కారు వారి పాట’ తర్వాత అత్యధిక ఓపెనింగ్ కలెక్షన్‌లు రాబట్టిన సినిమాగా రికార్డు సృష్టించింది.
రెండవ రోజు కూడా బుకింగ్స్ భారీ రేంజ్‌లో ఉన్నాయి. ఇలానే కంటిన్యూ అయితే మరో వారం రోజుల్లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యే చాన్స్ ఉంది. అయితే నేడు వాల్తేరు ‘వీరయ్య రిలీజై’ మంచి టాక్ తెచ్చుకుంది. దాంతో వీరసింహుడుపై కలెక్షన్ల ప్రభావం పడే చాన్స్ ఉంది. అంతేకాకుండా శనివారం ‘వారసుడు’ కూడా రిలీజ్ కానుంది. దాంతో థియేటర్ కౌంట్ చాలా వరకు తగ్గనుంది. చూడాలి మరి ఈ సంక్రాంతికి ఎవరు పైచేయి సాధిస్తారో అని.