నందమూరి బాలకృష్ణ హీరోగా గోపిచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన చిత్రం వీర సింహారెడ్డి. ఈ సినిమా విషయంలో బాలయ్య ఫాన్స్ కి ఎన్నో అంచనాలు ఏర్పడ్డాయి. సినిమా ప్రకటన వచ్చిన నాటి నుంచి విడుదల వరకు కూడా అందరూ ఎన్నో అంచనాలతో ఎదురు చూసిన పరిస్థితి. ఇక ఈ సినిమా కోసం బాలకృష్ణ చాలా కష్టపడ్డారు. ఆయన ఏకంగా రెండు పాత్రల్లో నటించారు.
బాలకృష్ణ ఈ మధ్య కాలంలో విజయాల కోసం ఎదురు చూస్తున్న సమయంలో అఖండ, వీర సింహారెడ్డి మంచి హిట్ లు వచ్చాయి. ఇదిలా ఉంచితే ఈ సినిమా బాలకృష్ణ తండ్రి… ఎన్టీఆర్ హీరోగా వచ్చిన సినిమాకు కాపీగా ఉంటుంది అని సంచలన వ్యాఖ్యలు చేసారు పరుచూరి గోపాల కృష్ణ. ఈ సినిమా బాగుంది అని బోయపాటి శ్రీను ఈ సినిమా తీసినట్టుగా ఉందని ఆయన కొనియాడారు.
ఈ సినిమా చూస్తుంటే తనకు ఎన్టీఆర్ నటించిన చండశాసనుడు సినిమా గుర్తుకు వచ్చిందని తెలిపారు. ఈ రెండు సినిమాలలో మెయిన్ స్టోరీ ఒకటే అన్నారు. అన్నాచెల్లెళ్ల మధ్య వైరం… అన్నయ్య నాశనం అయిపోవాలని చెల్లి శపించడం లాంటి అంశాలు రెండు సినిమాల్లోనూ ఉన్నాయని, వీర సింహారెడ్డి సినిమాలో తాను కోరుకున్న వాడిని చంపించి వేసాడన్న కోపంతో.. అన్నయ్య శత్రువుతోనే తాళికట్టించుకొని వాళ్ల సాయంతో సొంత అన్న మీద పగ తీర్చుకోవాలని వరలక్ష్మి చూస్తుందని… బాలయ్య బాడీ లాంగ్వేజ్ కు ఇది చాలా బాగా సెట్ అయిందన్నారు.