నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన సినిమా ‘వీర సింహారెడ్డి’. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.
ఈ నేపథ్యంలో ఈ చిత్ర విజయోత్సం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో ‘మాతో పెట్టుకోకు’ సినిమాలోని ‘మాఘమాసం లగ్గం పెట్టిస్తా..’ పాటను స్టేజ్‌పై బాలయ్య బాబు పాడటం ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ముఖ్యంగా బాలయ్య తన శైలిలో పాట పాడిన విధానం ఆయన అభిమానులను బాగా అలరించింది.శ్రుతిహాసన్ కథానాయికగా నటించిన ఈ వీరసింహారెడ్డి సినిమా ఇంకా ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ పొందుతుంది.
నటసింహం బాలయ్య తన నటనతో ఈ సినిమా స్థాయిని పెంచారు. అలాగే, దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్, హనీ రోజ్ ఈ సినిమాకి ప్లస్ అయ్యారు. దాంతో ఈ సినిమా నాలుగు రోజుల్లోనే వంద కోట్ల మార్క్ దాటేసింది.
Moment of the day 🤩🤩
The GOD OF MASSES is entertaining the crowd with his singing 💥💥
Watch వీరసింహుని విజయోత్సవం Live Now!
– https://t.co/OYdts1a9tU#BlockBusterVeeraSimhaReddy
Natasimham #NandamuriBalakrishna @shrutihaasan @megopichand @MusicThaman @shreyasgroup pic.twitter.com/YDn6xxkTgw
— Mythri Movie Makers (@MythriOfficial) January 22, 2023