బాలకృష్ణ హీరోగా నటించిన సినిమా వీరసింహారెడ్డి. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలైంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు భారీ ఓపెనింగ్స్ దక్కాయి. అయితే ఆ తర్వాత సినిమా ఆశించిన స్థాయిలో రన్ అవ్వలేదు.
ఈ సంగతి పక్కనపెడితే, ఇప్పుడీ సినిమా సక్సెస్ సంబరాల్ని షురూ చేసింది యూనిట్. రేపు, అంటే 22వ తేదీన హైదరాబాద్ లో వీరసింహారెడ్డి విజయోత్సవం ఏర్పాటుచేశారు. జేఆర్సీ కన్వెన్షన్ లో రేపు సాయంత్రం 5 గంటల నుంచి ఈ సంబరాలు షురూ అవుతున్నాయి.
వీరసింహారెడ్డి విజయోత్సవంలో పాల్గొనేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో నందమూరి అభిమానులు హైదరాబాద్ చేరుకుంటున్నారు. ఈ వేడుకలో హీరో బాలకృష్ణతో పాటు టోటల్ యూనిట్ అంతా పాల్గొనబోతోంది. ప్రత్యేక అతిథిగా ఓ స్పెషల్ గెస్ట్ వస్తాడనే ప్రచారం నడుస్తోంది. అది ఎవరనేది రేపు తేలుతుంది.