బ్యాటింగ్ చేయడంలో ఒక్కొక్కరిదీ ఒక్కో స్టైల్…. కొంత మంది మంత్రాలు చదువుతూ బ్యాటింగ్ చేస్తే….కొంత మంది తమ ఇష్టమైన వారిని తల్చుకుంటూ బ్యాటింగ్ చేస్తుంటారు. కానీ భారత డాషింగ్ బ్యాట్స్ మెన్ వీరేంద్ర సెహ్వగ్ మాత్రం పాటలు పాడుతూ బ్యాటింగ్ చేసేవాడట! ఆ టైమ్ లో తనకిష్టమైన పాటు ఏది గుర్తొస్తే దాన్ని పాడుకుంటూ బాల్ పనిపట్టేవాడట!
వీరూ గురించి మరిన్ని విషయాలు:
- 12 ఏళ్ల వయస్సులో క్రికెట్ ఆడొద్దని సెహ్వాగ్ తండ్రి సెహ్వాగ్ ను కొట్టారట!
- చిన్నప్పటి నుండే వీరూ హార్ట్ హిట్టింగ్ చేసేవాడట!
- మొదటి మ్యాచ్ పాకిస్థాన్ తో ఆడినప్పుడు సరిగ్గా ఆడని కారణంగా దాదాపు 20 నెలలు టీమ్ కు దూరమయ్యాడు
- తన 4 వ వండే లో జింబాబ్వేపై సెంచరీ చేసి…. టీమ్ లో తన స్థానాన్ని ఫిక్స్ చేసుకున్నాడు.
భారీ రికార్డులు :
1) టెస్టుల్లో 2 సార్లు 300+ పరుగులు చేసిన బ్యాట్స్ మెన్
2) 2011 వరల్డ్ కప్ లో …వరుసగా 5 మ్యాచుల్లో బౌండరీలు కొట్టిన బ్యాట్స్ మెన్
3) వండే లో వీరూ హైయెస్ట్ స్కోర్ 219 ….సచిన్ తర్వాత ఆ మార్క్ ను దాటింది వీరూనే!