జనతా కర్ఫ్యూ ముగిసింది. తెలంగాణ లాక్ డౌన్ ప్రారంభం అయింది. నిత్యావసర వస్తువులు, కూరగాయల ధరలు పెరిగితే చర్యలు తప్పవు అని సర్కార్ హెచ్చరిస్తూ… లాక్ డౌన్ చెప్పేసింది. కానీ తెల్లవారే సరికి కూరగాయల రేట్లు అమాంతం పెరిగిపోయాయి. అంతకు ముందు 10 నుండి 15 రూపాయలకు కిలో టమాట ఉంటే ఇప్పుడు ఏకంగా 50 నుండి 60కి అమ్ముతున్నారు. పచ్చిమిర్చి రేటు 200 దాటింది. మిగతా కూరగాయల రేటు దాదాపు అంతే.
సరే… బంద్ ఉంది కాబట్టి సరఫరా నిలిచిపోయింది అని ఉరుకుందామా…? మరి ఇప్పుడు ఏకంగా లాక్ డౌన్ అయింది కదా అంటే సామాన్యుని ఖచ్చితంగా టెన్షన్ పెడుతుంది. ఇప్పుడే సీఎం కేసీఆర్ ఎప్పుడు చెప్పినట్లు ఉక్కు పిడికిలి సంకల్పం అవసరం. నిత్యావసర సరుకుల ధరలు పెంచే ప్రమాదం కూడా ముంచుకొస్తుంది. తెలంగాణ సర్కారు కి ఇప్పుడు అసలైన పరీక్ష మొదలయ్యింది అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాజకీయంగా కేసీఆర్ పై ఎన్ని ఆరోపణలు ఉన్నా… సామాన్యుడు కేసీఆర్ పై నమ్మకంతో ఉంటూ వచ్చాడు. కానీ ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో సీఎం కేసీఆర్ పనితీరు ఖచ్చితంగా కొలమానం అవుతుంది అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.