మధ్యప్రదేశ్‌లో బీభత్సం సృష్టించిన కారును అడ్డుకుని స్థానికులు దానికి నిప్పటించారు. ఈ ఘటనలో కారు డ్రైవర్ మృతి చెందారు. ఈ ఘటన రాష్ట్రంలోని అలీరాజ్ పూర్ జిల్లాలో చోటు చేసుకుంది. ఎస్పీ సఖారామ్ సెంగార్ తెలిపిన వివరాల ప్రకారం….
జిల్లా కేంద్రానికి 38 కిలోమీటర్ల దూరంలోని బర్జార్ క్రాసింగ్ వద్ద బాలిక కాంజీ(6)పై నుంచి కారు దూసుకు వెళ్లింది. దీంతో బాలిక శరీరం నుజ్జు నుజ్జు అయింది. దీంతో డ్రైవర్ భయాందోళనలకు గురయ్యాడు. కారు ఆపకుండా ముందుకు వెళ్ళారు.
దీంతో స్థానికులు కోపోద్రిక్తులు అయ్యారు. డ్రైవర్ ను వెంబడించి వారు పట్టుకున్నారు. కారు నుంచి డ్రైవర్ ను బయటకు లాగి అతనిపై దాడి చేశారు. అనంతరం కారును నిప్పటించారు. ఆ మంటల్లో కారు డ్రైవర్ తోసివేయడంతో అతను అక్కడిక్కడే మరణించాడు.
దీనికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. పోలీసుల దృష్టికి వెళ్లడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డ్రైవర్ మరణానికి కారణమైన వారిని పట్టుకునే పనిలో పోలీసులు ఉన్నారు.
శుక్రవారం రాత్రి పికప్ వాహనం ఆరేళ్ల కాంజీ నుజ్జునుజ్జు అయిందని, ఆ తర్వాత ప్రజలు వాహనానికి నిప్పుపెట్టారని పోలీసు సూపరింటెండెంట్ ఎస్పీ సఖారామ్ సెంగార్ పిటిఐకి తెలిపారు.