పురాతన కాలానికి చెందిన ప్రహరీ గోడ శిథిలావస్థకు చేరి కూలిపోవడంతో 8 కార్లు, రెండు ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటన సికింద్రాబాద్ లోని యశోద ఆసుపత్రి సమీపంలో చోటుచేసుకుంది.
శనివారం తెల్లవారు జామున ఏడు గంటల సమయంలో ఒక్కసారిగా గోడ కూలి కార్లపై పడడంతో పెద్ద శబ్దం వచ్చింది. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఎనిమిది కార్లు ముందు వెనుక భాగాలు అద్దాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి.
ప్రమాద సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పిందంటున్నారు స్థానికులు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని పరిశీలించారు.
Advertisements
అయితే.. అవి శిథిలావస్థకు చెందడంతో పాటు.. ఇటీవల కురిసిన వర్షానికి పూర్తిగా దెబ్బతిన్నట్టు పోలీసులు వెల్లడించారు. తమ వాహనాలు ద్వంసం అవడంతో తాము భారీగా నష్ట పోయామంటున్నారు వాహన యజమానులు.