టోల్‌గేట్ వద్ద ఫీజు చెల్లించే వాహనాలకు నిబంధనలను జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ కఠినతరం చేసింది. నగదు చెల్లించే వాహనాలు ఫాస్టాగ్ లైనులోకి వస్తే ఫీజు రెట్టింపు వసూలు చేస్తున్నారని, ఇకపై ఫాస్టాగ్ ఉండి, రీఛార్జి చేయించుకోకుండా, ఇదే లైన్‌లోకి వచ్చి నగదు చెల్లించాలని చూస్తే రెట్టింపు ఫీజు వసూలు చేస్తారు.