టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పై ఏపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తీవ్ర విమర్శలు చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్ లో మాట్లాడుతూ.. ఆర్యవైశ్యులపై చంద్రబాబుది కపట ప్రేమ అని ఆరోపించారు.
సినీ నటి కవితను ఏడిపించి బయటకు పంపలేదా? ఆర్యవైశ్యులను అడుగడుగునా చులకనగా చూస్తూ.. అవమానిస్తోంది చంద్రబాబు కాదా అని నిలదీశారు. ఆయన సీఎం ఉన్నప్పుడు తన మంత్రి వర్గంలో పనిచేసిన సిద్దా రాఘవరావును బలవంతంగా ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయించి ఓటమికి కారణమయ్యారని గుర్తు చేశారు. అదే సమయంలో మాచర్లలో గోపవరపు మల్లికార్జునరావును వేధించడంతో దంపతులిద్దరు చనిపోయారని ఆరోపించారు.
రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని నవ నిర్మాణ దీక్ష అంటూ పొట్టి శ్రీరాములుని అవమానించారని అన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఆర్య వైశ్యుల ద్రోహులని అన్నారు వెల్లంపల్లి. మాజీ సీఎం రోశయ్య బతికున్నప్పుడు చంద్రబాబు అనేక విధాలుగా ఇబ్బంది పెట్టారని విమర్శించారు.
అధికారంలో ఉంటే తోలు తీస్తానంటారు.. ప్రతిపక్షంలో ఉంటే అండగా ఉంటానంటారని ఎద్దేవ చేశారు. మాజీ సీఎం రోశయ్య మరణిస్తే మూడు రోజులు సంతాప దినాలుగా జగన్ ప్రకటించారని గుర్తు చేశారు.