వెలుగూరి రాధా కృష్ణ మూర్తి
అనుకున్నంతా జరిగింది. 20 లక్షల కోట్ల రూపాయల ప్యాకే జీకి బడా కార్పొరేట్, పారిశ్రా మిక వర్గాలు హర్షం వెలిబుచ్చ
గానే దేశానికి, ప్రజలకు ఏదో దుర్మార్గం జరగ బోతూoదని ఊహించిందే! లాక్ డౌన్ రహ స్యం బట్టబయలైoది. లాక్
డౌన్ పేరుతో రోడ్లపై ప్రజలను కనపడకుండా చేశారు. ప్రజా నిరసనలకు తావే లేకుం డా జాగ్రత్త పడ్డారు. మూడు దశ ల లాక్ డౌన్ ముగిసింది.
చివరి అంకానికి వచ్చింది. 4 వ దశ లాక్ డౌన్ లో అన్నిటికి మినహాయింపులు ఇచ్చారు. ప్రజలు మాత్రం బైటకు రాకూ డదు. తమ చిరకాల ఏజండా అమలుకు ఇదే మంచి సమయం. నిరసనలు, ప్రతిఘట నలు ఉండవు. కోవిడ్ 19 ప్యా కేజీ పేరుతో , దానికి ఏమాత్రం సంబంధం లేని ఏజండాను బైటకుతీసి ప్యాకేజి క్రింద ప్రకటించారు. 500 బొగ్గుగనుల బ్లాక్ లను బడా కార్పొరేట్లకు అప్పజెప్పేస్తారు. రక్షణ రంగములో విదేశీ పెట్టుబడుల శాతాన్ని 49 నుండి 74 కు పెంచేశారు.
200 సంవత్సరాల చరిత్ర గల మన ఆయుధ తయారీ ఫ్యాక్ట రీ లన్నీ విదేశీ పెట్టుబడిదార్ల చేతుల్లో పెట్టేస్తారు. అది మోడీ మార్క్ దేశ భక్తి. ఇప్పటికే 12 ఎయిర్ పోర్టుల ను మోడీ తన కార్పొరేట్ మి త్రులకు అప్పగించేశారు. ఈ ప్యాకేజ్ లో మరో 6 ఎయిర్ పోర్టులను ప్రయివేటు పరం చేస్తున్నారు. ప్రయివేటీ కరణ పితామహులే ఆశ్చర్య పోయే ట్లుగా అంతరిక్ష పరిశోధనలు, అంతరిక్ష యాత్రల రంగం, గ్రహాల అన్వేషణ, ఆటోమిక్ ఎనర్జీ లాంటి అత్యంత కీలక వ్యవస్థలను బడా పారిశ్రామి క, కార్పొరేట్ వర్గాలకు ధారా దత్తం చేస్తున్నారు.
దేశ రక్షణ, భద్రత, దేశభక్తి గురించి నిరంతరం జపం చేసే మోడీజీ యే వాటన్నిటి విధ్వంసానికి పాల్పడటం విషాదం. కార్మికులు, ప్రజల నుండి నిర సనలు , ప్రతిఘటనలు లేకుం డా లాక్ డౌన్ పరిస్థితి ఉప యోగ పడుతుంది. ఇప్పటికే కార్మిక చట్టాలు 1000 రోజుల పాటు రద్దు,12గం.ల పని దినం, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల,పెన్షనర్ల కరువు భత్తెంచెల్లింపులు సంవత్సరమున్నర పాటు వాయిదా, 4 కోట్లమంది కార్మిక ఉద్యోగులకు 2శాతం పి.యఫ్ తగ్గింపు లాంటి నిర్ణయాలతోకార్మికులను కట్టుబానిసలను చేయ బూనుకున్నాడు. దేశరాజ్యాoగ నిబంధనలకు విరుద్ధంగా ” నిర్బంధ శ్రమ ” నురుద్దే ప్రయత్నం చేస్తున్నాడు మోడీ. అన్ని శక్తులూ కూడ గట్టు కొని ప్రతిఘటించటం తప్ప వేరే మార్గ మేముంది ?.