ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయ వార్షిక ఆదాయాన్ని లెక్కించారు అధికారులు. రూ. 87.78 కోట్ల ఆదాయం వచ్చినట్టు అధికారులు వెల్లడించారు. కరోనా కారణంగా దాదాపు రెండు నెలలు దర్శనాలు నిలిపివేసినప్పటికీ.. భారీగానే సమకూరిందంటున్నారు.
ఈ ఏడాది సమ్మక్క, సారలమ్మ జాతర రావడంతో అదనపు ఆదాయం వచ్చిందని అంటున్నారు. 2019-20 సంవత్సరంలో సమ్మక్క, సారలమ్మ జాతర జరగగా.. ఆ ఏడాది ఆలయానికి రూ.85 కోట్ల ఆదాయం రాగా.. 2021-22 సంవత్సరానికి రూ.87.78 కోట్ల ఆదాయం వచ్చిందని ఆలయ అధికారులు తెలిపారు.
ఇందులో హుండీ ద్వారా 28.34 కోట్లు, కోడె మొక్కులతో 18.28 కోట్లు, ప్రసాదాల ద్వారా 13.86 కోట్లు, ఆర్జిత సేవలతో రూ.6.83 కోట్లు, లీజులు, అద్దెల ద్వారా రూ.5.35 కోట్లు, సహా ఇతరత్రాల ద్వారా మరికొంత వచ్చాయని అధికారులు వెల్లడించారు.
కరోనా కారణం రెండేళ్లుగా ఆలయాదాయాలు తగ్గాయని..ఈ ఏడు కాస్త కరోనా తగ్గడంతో మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు వచ్చిన భక్తులు వేములవాడ ఆలయానికి పోటెత్తారు. దీంతో ఆలయ ఆదాయం పెరిగిందంటున్నారు అధికారులు.