వేములవాడలో దారుణ ఘటన వెలుగుచూసింది. నవమాసాలు మోసి జన్మనిచ్చిన కన్నతల్లే పిల్లల్ని కాటికి పంపేందుకు ప్రయత్నించింది. తాను కూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.
జగిత్యాల జిల్లా కొడిమ్యాలకు చెందిన మమతకు వరుణ్ తేజ, అక్షయ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే.. వేములవాడలో ఇద్దరి పిల్లల గొంతు కోసి తాను కూడా చనిపోవాలని చూసింది మమత. చుట్టుపక్కల వారు గమనించి ముగ్గుర్ని ఆసుపత్రికి తరలించారు. త్వరగా చికిత్స అందడంతో ముగ్గురు ప్రాణాలతో బయటపడ్డారు.