దళిత బంధు పథకంపై నిరసనలు ఆగడం లేదు. రాష్ట్రంలో ఏవో కొన్ని చోట్ల ఈ పథకాన్ని అమలు చేసి. మిగిలిన చోట్ల ఇస్తామని మభ్యపెట్టి ఓట్లను గడించే ఉద్దేశ్యంతో కేసీఆర్ ఉన్నారని ప్రజలు భావిస్తున్నారు. దీంతో ఎక్కడికక్కడ అధికార పార్టీ ఎమ్మెల్యేలను నిలబెట్టి నిలదీస్తున్నారు. తాజాగా వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌కు నియోజవకర్గ పర్యటలో చేదు అనుభవం ఎదురైంది.
వేములవాడ రూరల్ మండలంలో పర్యటిస్తున్న చెన్నమనేని రమేష్‌ను.. దళిత బంధు అమలు గురించి ప్రశ్నించారు స్థానికులు. హుజూరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని మరో నాలుగు మండలాల్లో పథకాన్ని అమలు చేయాలని కేసీఆర్ చూస్తున్నారని గుర్తు చేసిన వారు.. ఆ జాబితాలో వేములవాడ రూరల్ మండలం ఎందుకు లేదని నిలదీశారు. స్థానిక ఎమ్మెల్యేగా ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.
ఎమ్మెల్యేతో పాటుగా ఉన్న నేతలు.. వేములవాడలో కూడా దళిత బంధు పథకం అమలు అవుతుందని సర్దిచెప్పబోగా.. గతంలోకూడా ఇలాంటి హామీలే ఇచ్చారని.. కానీ ఇంతవరకూ చేసిందేమీ లేదని స్థానికులు మండిపడ్డారు. దీంతో ఎమ్మెల్యే సమాధానం చెప్పలేకపోయారు. స్థానికులు మరింత గట్టిగా అడగడంతో.. పోలీసులు బలవంతంగా వారిని పక్కకు తీసుకెళ్లారు.