ఉక్రెయిన్ లో వివాదం మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందని వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మధురో అన్నారు. అందువల్ల యుద్ధాన్ని ఆపటం చాలా ముఖ్యమని తెలిపారు.
సైనిక దృక్కోణంలో చూసినప్పుడు ఈ వివాదం మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందని అని పిస్తోంది. రవాణా, ఫర్టిలైజర్, ఆహారపదార్థాల ధరలు, పెట్రోల్, గ్యాస్, చమురు ధరలు పెరగడం లాంటి పరిణామాలు గ్లోబల్ గా కనిపిస్తున్నాయి.
ఈ గ్లోబల్ ప్రభావం అభద్రతా, అంతర్జాతీయ సంబంధాల నిర్వహణ రూపంలో వ్యక్తం అవుతోంది. సకాలంలో హెచ్చరికలు “పాశ్చాత్య, ప్రపంచంలోని అత్యంత ముఖ్యమైన నాయకులను పట్టుకున్న పిచ్చిని ఆపగలదని” ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
దేశంలో ద్రవ్యోల్బణం తగ్గించడానికి, ఐరోపాలో యుద్దం వల్ల వస్తున్న సంభావ్య ప్రభావాలను నియంత్రించడానికి తమ ప్రభుత్వం పలు చర్యలను తీసుకుంటోందని ఆయన వెల్లడించారు.