రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు భావోద్వేగానికి లోనయ్యారు. సభ్యుల తీరుపై అసహనం వ్యక్తం చేస్తూ ప్రసంగించిన ఆయన కంటతడి పెట్టారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు… ప్రారంభం అయినప్పటి నుంచి విపక్షాల ఆందోళనలతోనే సరిపోతోంది. ఏ విషయంపైనా సరైన చర్చ జరగడం లేదు. పైగా మంగళవారం మరింత రెచ్చిపోయిన ప్రతిపక్ష నేతలు పోడియం చుట్టుముట్టి.. చైర్మన్ ముందు భాగంలో ఉండే అధికారుల టేబుల్స్ పైకి ఎక్కారు.
ఇవాళ కూడా సభలో ప్రతిపక్ష సభ్యులు ఆందోళనలు కొనసాగించడంతో అసహనానికి లోనయిన వెంకయ్య.. సభ దేవాలయమైతే.. చైర్మన్ ముందు ఉండే ప్రాంతం గర్భగుడిలాంటిదని చెప్పారు. అలాంటిది కొందరు నేతలు టేబుల్స్ పైకి ఎక్కి నిల్చోవడంపై భావోద్వేగానికి లోనయ్యారు. ఈ చర్య తనను ఎంతో బాధించిందని చెప్పారు. రాత్రంతా నిద్ర పట్టలేదని చెబుతూ… కంటతడి పెట్టుకున్నారు.
సభలో సభ్యులు సభ్యతతో వ్యవహరించాలని కోరారు వెంకయ్య. చర్చ ద్వారా సభ్యులు తమ అభ్యంతరాలను తెలియజేయాలన్నారు.