సోషల్ మీడియా, ఇంటర్ నెట్ లో అశ్లీలతపై ఎంపీలు సలహాలు, సూచనలు ఇవ్వాలని రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు కోరారు. ఏఐఏడీఎంకే సభ్యుడు విజిల సత్యనాథ్ అశ్లీలతపై రాజ్యసభలో లేవనెత్తిన సమస్యపై వెంకయ్యనాయుడు స్పందించారు. కాంగ్రెస్ ఎంపీ జైరామ్ రమేష్ నేతృత్వంలో వినయ్ సహస్రబుద్ద (బీజేపీ),సుఖెంద్ శేఖర్ రాయ్(టీఎంసీ), తిరుచి శివ(డీఎంకే) మరొకందరు ఎంపీలు కమిటీగా ఏర్పడి సోషల్ మీడియా, ఇంటర్నెట్ లో అశ్లీల చిత్రాలు పిల్లలు, యువతపై ఎలాంటి ప్రభావం చూపుతున్నాయో సలహాలు, సూచనలు ఇవ్వాలన్నారు. సామాజిక, చట్టపరమైన చర్యలతో ఒక అర్ధవంతమైన పరిష్కారం కోసం ఎంపీలు ముందుకు రావాలన్నారు. ఇది చాలా తీవ్రమైన అంశం… పటిష్టమైన పరిష్కారానికి సలహాలిస్తే వాటిని తాను సమాచార, ప్రసార శాఖా మంత్రికి సూచిస్తానన్నారు. అశ్లీలత ప్రమాదకర స్థాయికి చేరింది. ముఖ్యంగా తల్లదండ్రులు చాలా ఆందోళనకు గురి చేస్తోందని వెంకయ్య నాయుడు చెప్పారు. జైరామ్ రమేష్ జీ మీరు చొరవ తీసుకుంటారా అని వెంకయ్యనాయుడు ప్రశ్నించారు. ఇదిఅధికారిక కమిటీ కాదని…దేశ విస్తృత ప్రయోజనాల కోసం ఏర్పడే కమిటీ అన్నారు.
దీనిపై మహిళా, శిశు సంక్షేమ మంత్రి స్మృతి ఇరానీ మాట్లాడుతూ… 377 అశ్లీల వెబ్ సైట్లను ఇంటర్నెట్ నుంచి తొలగించి 50 ఎఫ్.ఐ.ఆర్ లు దాఖలు చేసినట్టు తెలిపారు.