రాజ్యసభ్యలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మలయాళ నటుడు, రాజ్యసభ ఎంపీ సురేష్ గోపి మధ్య చిన్న హాస్య సన్నివేశం జరిగింది. దీంతో సభలో అందరూ నవ్వులు కురిపించారు. సురేష్ గోపీ గడ్డాన్ని చూసిన వెంకయ్యనాయుడు ఒక్క క్షణం అయోమయంలో పడ్డారు. వెంటనే ఆయన అడిగిన ప్రశ్నకి సభలో అందరూ ఒక్కసారిగా నవ్వేశారు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొట్టడంతో.. వెంకయ్యనాయుడి సెన్స్ ఆఫ్ హ్యూమర్‌కి నెటిజన్లు కూడా ఫిదా అయిపోతున్నారు.
ఇంతకి వెంకయ్యనాయడు ఏమని అడిగి ఉంటారనే కదా.. మలయాళ నటుడు, రాజకీయ నాయకుడు సురేష్ గోపి నామినేటెడ్ రాజ్యసభ ఎంపీగా కొనసాగుతున్నారు. అయితే సభ చైర్మన్‌ను ఉద్దేశించి ఆయన మాట్లాడుతుండగా.. అది మాస్కా.. లేదా గడ్డమా..? అని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సురేష్ గోపి గడ్డన్ని ఉద్దేశించి నవ్వుతూ అడిగాడు.
దీంతో సభలో ఒక్కసారిగా నవ్వుల వర్షం కురిసింది. దీనికి సురేష్ గోపి కూడా నవ్వుతూ సమాధానం ఇచ్చారు. ఇది గడ్డమే అని.. రాబోయే సినిమాలో తన కొత్త లుక్ అని చెప్పారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.
HAHAHA! Our VP @MVenkaiahNaidu Garu and his wicked sense of humour! Never a dull moment with him around! Suresh Gopi this time!
Yappa! 😂 #CannotAbleTo #EpicLol pic.twitter.com/WfhZ6NIsYb
— मङ्गलम् (@veejaysai) March 25, 2022
Advertisements