పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి రాజ్యసభ ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని ఉప రాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు అన్నారు. ఆదివారం రాజ్యసభ దినోత్సవం సందర్భంగా ఎగువ సభ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని నిర్మాణాత్మక చర్చలు జరపాలని కోరారు. ప్రతి ఒక్కరూ ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకోవాలని సభ్యులకు ఆయన ట్విట్టర్ ద్వారా పిలుపునిచ్చారు. ‘రాజ్యసభ దినోత్సవ శుభాకాంక్షలు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో రాజ్యసభ ప్రారంభమైనప్పటి నుండి కీలక పాత్ర పోషించింది. ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని సమాచార, నిర్మాణాత్మక చర్చల్లో పాల్గొనాలని, రాజ్యసభ సభ్యులకు నేను విజ్ఞప్తి చేయాలనుకుంటున్నాను’ అని ట్వీట్ చేశారు.
Greetings on Rajya Sabha Day!
Ever since its inception, Rajya Sabha has played a crucial role in strengthening parliamentary democracy. I would like to appeal to the members of #RajyaSabha to engage in informed & constructive debates by keeping the welfare of the people in mind.
— Vice President of India (@VPSecretariat) April 3, 2022
Advertisements
రాజ్యసభ అధికారిక వెబ్ సైట్ ప్రకారం మొదటి సమావేశం 1946 డిసెంబర్ 9న జరిగింది. 1950 వరకు ఇది కేంద్ర శాసనమండలిగా కొనసాగింది. అనంతరం తాత్కాలిక పార్లమెంట్ గా మారింది.
రాజ్యసభగా నామకరణం ఆగస్టు 23, 1954న ప్రకటించబడింది. ఎన్నికైన సభ్యులే కాకుండా, 12 మందిని రాష్ట్రపతి సభకు నామినేట్ చేసేలా ఏర్పాటు చేయబడింది.