నాగచైతన్య నెక్ట్స్ మూవీ లాక్ అయింది. వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో ఓ సినిమా చేయబోతున్నాడు ఈ అక్కినేని హీరో. అయితే ఈ సినిమాపై మొన్నటివరకు చాలా ప్రచారం జరిగింది. వెంకట్ ప్రభు తాజాగా తీసిన సూపర్ హిట్ సినిమా మానాడు సినిమాకు రీమేక్ గా నాగచైతన్య సినిమా రాబోతోందనే ప్రచారం జరిగింది. తాజాగా దీనిపై వెంకట్ ప్రభు క్లారిటీ ఇచ్చాడు.
నాగచైతన్యతో తను ఓ ఫ్రెష్ సబ్జెక్ట్ తో సినిమా చేయబోతున్నట్టు తెలిపాడు దర్శకుడు వెంకట్ ప్రభు. తను రీసెంట్ గా తీసిన బ్లాక్ బస్టర్ మూవీ మానాడుకు, చైతూ సినిమాకు ఎలాంటి పోలిక ఉండదని స్పష్టం చేశాడు. ఈ సినిమాలో పూజా హెగ్డేను హీరోయిన్ గా తీసుకోవాలనుకుంటున్నారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి ఈ సినిమాను నిర్మించబోతున్నాడు.
నాగచైతన్యకు యాక్షన్ ఇమేజ్ లేదు. మధ్యమధ్యలో అతడు ఆ దిశగా ప్రయత్నాలు చేసినప్పటికీ అపజయాలే వెక్కిరించాయి. ఇప్పుడీ హీరో మరోసారి వెంకట్ ప్రభు సహకారంతో యాక్షన్ ఇమేజ్ పై కన్నేశాడు. ఈసారి కచ్చితంగా సక్సెస్ అయ్యే సబ్జెక్ట్ ఎంచుకున్నాడనేది ఇండస్ట్రీ టాక్.
Advertisements
మరోవైపు ఇదే సినిమాతో అతడు కోలీవుడ్ కు నేరుగా పరిచయం అవుతున్నాడు. సో.. నాగచైతన్య కెరీర్ కు వెంకట్ ప్రభు సినిమా చాలా కీలకం అన్నమాట. ప్రస్తుతం ఈ హీరో విక్రమ్ కుమార్ దర్శకత్వంలో దూత అనే వెబ్ సిరీస్ చేస్తున్నాడు. ఈ షూటింగ్ కంప్లీట్ అయిన వెంటనే వెంకట్ ప్రభు సినిమా స్టార్ట్ అవుతుంది.