చాన్నాళ్ల కిందటి పుకారు ఇది. గోపాల గోపాల సినిమాలో దేవుడ్ని నమ్మని నాస్తికుడిగా కనిపించిన వెంకటేశ్, ఈసారి ఏకంగా దేవుడిగా కనిపించబోతున్నాడంటూ ప్రచారం జరిగింది. విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న ఓరి దేవుడా సినిమా చుట్టూ ఈ ఊహాగానాలు చెలరేగాయి. ఆ తర్వాత అంతా ఆ పుకారు గురించి, ఆ సినిమా గురించి కూడా మరిచిపోయారు.
మళ్లీ ఇన్నాళ్లకు ఆ సినిమాతో పాటు, ఆ పుకారు కూడా తెరపైకొచ్చింది. ఓరి దేవుడా సినిమా రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేశారు. అక్టోబర్ 21న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా ఓ గ్లింప్స్ కూడా విడుదల చేశారు. అందులో దాదాపు దేవుడిలా కనిపిస్తున్నాడు వెంకీ. ఇలా ఒకేసారి 2 సర్ ప్రైజ్ లు విడుదల చేసి సినిమాపై హైప్ పెంచారు.
గ్లింప్స్‌ను గమనిస్తే.. వెంకటేష్ కూల్, స్టైలిష్ లుక్ లో దేవుడి పాత్రలో కనిపిస్తున్నాడు. చుట్టూ పుస్తకాలు.. సీతాకోక చిలుకలు మధ్య విశ్వక్ సేన్ కనిపించాడు. విక్టరీ వెంకటేష్ అంటే ఓ మేనరిజమ్ ఉంటుంది. ఆ మేనరిజమ్‌తో ఆయన ఫ్యాన్స్, ప్రేక్షకులకు గ్లింప్స్ చివర్లో సర్‌ప్రైజ్ ఇచ్చారు.
ఓరి దేవుడా చిత్రం షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ నడుస్తోంది. పివిపి సినిమా బ్యానర్స్‌పై ప్రసాద్ వి.పొట్లూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.