.విక్టరీ వెంకటేష్ గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఎన్నో సూపర్ డూపర్ హిట్ చిత్రాలతో వెంకటేష్ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే అందులో ముఖ్యంగా గుర్తుండిపోయే చిత్రం మాత్రం చంటి…. ఈ సినిమాలో ఒక అమాయకుడి పాత్రలో విక్టరీ వెంకటేష్ నటించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు.
జమిందారీ కుటుంబంలో పుట్టిన అమ్మాయికి ముగ్గురు అన్నయ్యలు ఉంటారు. వారి ముద్దులు చెల్లెలుగా మీనా ఇందులో నటించింది. ఇక ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి 29 ఏళ్లు అవుతోంది.
ముత్తైదువులకు బొట్టు ఎందుకు పెడతారో తెలుసా? అలా పెడితే అరిష్టమేనా!
కాగా ఈ సినిమాకి సంబంధించి ఎవరికీ తెలియని విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ సినిమా విషయంలో మెగాస్టార్ చిరంజీవి ఒక హీరోకి అన్యాయం చేశారట. తమిళ మూవీ చిన్న తంబీ సినిమాను తెలుగులో చంటి పేరుతో రీమేక్ చేశారు.
అయితే నిజానికి మొదట రాజేంద్రప్రసాద్ ఈ పాత్రకు సరిపోతాడని అనుకున్నారట. కానీ సురేష్ బాబు కె.ఎస్.రామారావు దగ్గరకు వచ్చి వెంకటేష్ తో సినిమా చేయాలని అడిగారట. ఆ సమయంలోనే మెగాస్టార్ చిరంజీవి జోక్యం చేసుకుని దర్శకుడు రవిరాజా పినిశెట్టి కి వెంకీ తో సినిమా చేసేలా ఒప్పించారట.
చిరు సినిమాకు సూపర్ స్టార్ కృష్ణ నో చెప్పిన సంగతి తెలుసా !!
ఇలా రాజేంద్రప్రసాద్ ను తప్పించి వెంకటేష్ తో సినిమా చేయడానికి చిరంజీవి కారణమయ్యాడని… రాజేంద్ర ప్రసాద్ కు చిరు అన్యాయం చేశాడని అప్పట్లో టాక్ నడిచేది.