వెంకటేష్, వరుణ్ తేజ్ నటించిన ఎఫ్ 3 కోసం ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే 9న ట్రైలర్ వస్తోందని ప్రకటించారు మేకర్స్. తాజాగా ఈ విషయాన్ని మరోసారి గుర్తు చేస్తూ ఇంట్రస్టింగ్ ఫోటో పోస్ట్ చేశారు.
ట్రైలర్ కు కావాల్సిన డబ్బింగ్ ను వెంకటేష్ పూర్తి చేశాడు. ఆ ఫోటోనే పోస్ట్ చేసిన మేకర్స్.. మే 9న ‘ఫన్ బాంబ్ ఎఫ్ 3’ ట్రైలర్ రాబోతోందని తెలిపారు. ఈ మూవీకి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించగా దిల్ రాజు నిర్మించాడు.
సూపర్ హిట్ అయిన ఎఫ్ 2 మూవీకి ఇది సీక్వెల్ గా వస్తోంది. ఈ సినిమాపై మంచి బజ్ నెలకొనగా మేకర్స్ ఎప్పటికప్పుడు ఆసక్తికర అప్ డేట్స్ ను అందిస్తూ వస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్, మేకింగ్ వీడియోస్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచేశాయి.
ఈ సినిమాలో హీరోయిన్స్ గా తమన్నా, మెహ్రీన్ లు నటించగా పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ లో మెరిసింది. సోనాల్ చౌహాన్ కూడా కీలక పాత్ర చేసింది. ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.
'Victory' @VenkyMama completes his dubbing part for #F3Trailer Fun Bomb 💥💣#F3Movie TRAILER unleashing on May 9th! 🤩
BIGGEST FUN FRANCHISE 🥳@IAmVarunTej @AnilRavipudi @tamannaahspeaks @Mehreenpirzada @sonalchauhan7 @ThisIsDSP @SVC_official @adityamusic@f3_movie #F3OnMay27 pic.twitter.com/L5ZfJEKFSS
— Sri Venkateswara Creations (@SVC_official) May 4, 2022
Advertisements