విక్టరీ వెంకటేష్, ఆర్తి అగర్వాల్ కాంబినేషన్ లో వచ్చిన నువ్వు నాకు నచ్చావ్ సినిమా ప్రేక్షకులను చాలా బాగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో కామెడితో పాటుగా డైలాగులు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇప్పటికి టీవీ లో వచ్చినా సరే ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరించే పరిస్థితి ఉంటుంది. వెంకటేష్ నటనకు ఆర్తి అగర్వాల్ అందాలకు త్రివిక్రమ్ మాటలకు సునీల్ కామెడికి మంచి మార్కులు పడ్డాయి.
Also Read:తన క్లోజ్ ఫ్రెండ్ ని మోసం చేసిన హీరోయిన్ ని ఎన్టీఆర్ ఏం చేసారంటే…?
అయితే ఈ సినిమా కమర్షియల్ గా అంతగా హిట్ కాలేదు. సినిమా మాస్ ఆడియన్స్ కు నచ్చలేదు అనే మాట వినపడింది. అయితే ఇప్పటికి టీవీ లో వచ్చినా చూస్తారు మరి. ఇక ఈ సినిమాలో వెంకటేష్, ఆర్తి ఆగర్వాల్ ని పెళ్లి చేసుకుంటాడు. ప్రకాష్ రాజ్ ఇంటికి వెంకటేష్ ఉద్యోగం కోసం వెళ్ళడం… ఆ తర్వాత వెంకటేష్ జాబ్ చేయడం, ఇదే క్రమంలో ఆర్తి… వెంకటేష్ తో ప్రేమలో పడటం జరుగుతాయి.
ఇక వెంకటేష్ ఆర్తి అగర్వాల్ నటించిన వసంతం సినిమా పాజిటివ్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద సందడి చేసింది . కమర్షియల్ గా పెద్దగా హిట్ కాలేకపోయినా. ఈ క్రమం లోనే ఓ సీన్లో హీరోయిన్ ఆర్తి అగర్వాల్ కి వెంకటేష్ చీర కట్టడం హైలెట్ గా ఉంటుంది. నిజానికి ఆ సన్నివేశం నిజంగానే షూట్ చేసారట. ఆర్తికి వెంకటేష్ నిజంగానే చీర కట్టడంతో సెట్ లో ఉన్న వాళ్ళు కూడా షాక్ అయ్యారట. వెంకటేష్ ఇప్పటివరకు ఏ హీరోయిన్ కి ఇలా చీర కట్టలేదు. ఆయన కెరీర్ లో అదే ఫస్ట్ అదే లాస్ట్.