వెంకటేష్ కెరీర్ లో గ్యాప్స్ గురించి మాట్లాడుకోవడం అనవసరం. ఎందుకంటే, అతడి కెరీర్ లో ఎప్పటికప్పుడు గ్యాప్స్ వస్తూనే ఉంటాయి. చేస్తే, వరుసపెట్టి సినిమాలు చేసేస్తాడు. లేదంటే సడెన్ గా గ్యాప్ తీసుకుంటాడు. ఇప్పుడు వెంకీ కెరీర్ లో మరోసారి గ్యాప్ వచ్చేసింది. ఎఫ్3 సినిమా షూట్ పూర్తయింది. ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ కు ఓ వెబ్ సిరీస్ చేస్తున్నాడు. అది కూడా పూర్తయిన తర్వాత వాట్ నెక్ట్స్ అంటే వెంకీ దగ్గర సమాధానం లేదు.
నిజానికి రీమేక్స్ విషయంలో వెంకటేష్ చకచకా నిర్ణయాలు తీసుకుంటాడు. రీమేక్ ప్రాజెక్టుల్ని తెరకెక్కించడంలో ఇతడు కింగ్. కానీ ఇప్పుడు ఏ రీమేక్ అతడికి అందుబాటులో లేకుండా పోయింది. ఓవైపు చిరంజీవి రీమేక్స్ చేస్తున్నాడు.
మరోవైపు పవన్ కల్యాణ్ కూడా రీమేక్స్ చేస్తున్నాడు. ఇంకోవైపు రాజశేఖర్, విశ్వక్ సేన్.. ఇలా చాలామంది నటులు రీమేక్ సబ్జెక్టులు లాక్ చేసి పెట్టుకున్నారు. దీంతో వెంకీకి రీమేక్ ప్రాజెక్టులు కూడా దొరకని పరిస్థితి.
Advertisements
వెంకీ దగ్గర ఎప్పట్నుంచో తేజ, తరుణ్ భాస్కర్ చెప్పిన కథలు పెండింగ్ లో ఉన్నాయి. కానీ వాటిపై ఓ పట్టాన నిర్ణయం తీసుకోలేకపోతున్నాడు వెంకటేష్. మరోవైపు కిషోర్ తిరుమల దర్శకత్వంలో సినిమాకు ఓకే చెబుదామంటే, అతడు వెంకీ కోసం ఆగలేదు. వెంకటేష్ కు చెప్పిన కథతో, శర్వానంద్ హీరోగా ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాను తెరకెక్కించాడు. దీంతో వెంకీకి మరోసారి గ్యాప్ తప్పేలా లేదు.