విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తమిళ్ సూపర్ హిట్ మూవీ అసురన్ సినిమా రీమేక్ నారప్ప లో నటిస్తున్నాడు. ఈ సినిమా కరోనా కి ముందు 70 శాతం షూటింగ్ పూర్తి చేసుకోగా ఆ తర్వాత కరోనా కారణంగా బ్రేక్ పడింది. అయితే మళ్లీ ఇప్పుడు అన్ని సినిమా షూటింగ్ లు మొదలవుతుండటంతో వెంకీ ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టాడు. తాజా షెడ్యూల్ వికారాబాద్ అడవుల్లో ప్రారంభమైంది. 15 రోజుల పాటు ఈ షెడ్యూల్ కొనసాగనుంది. ఈ షెడ్యూల్ లో వెంకటేష్ పై పలు కీలక సన్నివేశాలతో పాటు యాక్షన్ సీన్స్ తెరకెక్కిస్తున్నారు. కాగా ఈ సినిమా రిలీజ్ విషయంలో నిర్మాత సురేష్ బాబు ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
థియేటర్ లు ఇటీవల తెరుచుకున్నా ప్రేక్షకుల సందడి కనిపించడం లేదు. ఈ సమయంలో సినిమాను విడుదల చేయడం కరెక్ట్ కాదని సురేష్ బాబు భావిస్తున్నారట. అందుకే సినిమా రిలీజ్ విషయంలో తాము తొందర పడి నిర్ణయం తీసుకోలేమని చెబుతున్నారట. షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసి థియేటర్లు నూరుశాతం ఆక్యుపెన్సీ పొందిన తర్వాతే నారప్ప ను రిలీజ్ చేయలని బావిస్తున్నాడట.