వెంకీ మామతో హిట్ కొట్టిన విక్టరీ వెంకటేష్… తర్వాత చిత్రంతో బిజీగా మారిపోయాడు. తమిళ్‌లో మంచి హిట్ కొట్టిన అసురన్ సినిమా రీమేక్‌గా రాబోతున్న నారప్ప సినిమాలో వెంకీ నటిస్తున్నారు. ఇప్పటికే ఫస్ట్ లుక్‌ను కూడా విడుదల చేసిన ఈ సినిమాకు దర్శకుడిగా శ్రీకాంత్ అడ్డాల పనిచేస్తున్నారు.
అయితే, ఈ సినిమాలో 12 నిమిషాల పాటు ఉండే కీలకమైన ఫైట్ సీన్స్ కోసం తమిళనాడు వెళ్లిందట చిత్ర యూనిట్. వెంకటేష్‌పై చిత్రీకరించే ఈ సన్నివేశాలను రెడ్ డెసర్ట్‌లో చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. పీటర్ హెయిన్స్ ఈ సన్నివేశాలను దగ్గరుండి చూసుకుంటుండగా… అసురన్‌లోనూ పీటర్ హెయిన్సే పనిచేయటం విశేషం. ఇక్కడే దాదాపు 12 రోజుల పాటు షూటింగ్ జరగబోతుందట.
తమిళ్‌లో మంచి విజయం సాధించిన అసురన్‌ను వెక్కాయ్ అనే నవల ఆధారంగా తెరకెక్కించారు.