సూపర్ హిట్ సినిమా మన్మథుడు పేరుని వాడుకుని టాలీవుడ్ కింగ్ నాగార్జున చేసిన మన్మథుడు 2 విడుదలై ఘోరపరాజయం మూటకట్టుకుంది. నటుడు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రకుల్ ప్రీత్ జంటగా నాగ్ పండించిన ముదురువయసు ప్లేబోయ్ రొమాన్స్ టాలీవుడ్ ప్రేక్షకుల తిరస్కారానికి గురయింది. ఈ ఫలితం నాగ్ బావ అయిన విక్టరీ వెంకటేశ్ కి ఒక ఐ ఓపెనర్ గా మారిందనేది లేటెస్ట్ ఫిల్మ్ నగర్ టాక్.
వివరాల్లోకి వెళ్తే బాలీవుడ్ లో అజయ్ దేవగణ్, టబూ, రకుల్ ప్రీత్ ముఖ్య పాత్రల్లో విడుదలయిన “దే దే ప్యార్ దే” చిత్రం ఘన విజయం సాధించింది. పెళ్లీడుకొచ్చిన కూతురున్న ఒక నడివయస్కుడు మళ్ళీ దాదాపు కూతురు వయసున్న అమ్మాయితో ప్రేమలో పడే ఇతివృత్తంతో సాగే కథ ఇది. బాలీవుడ్ ప్రేక్షకులయితే ఆదరించారు, మరి తెలుగు ప్రేక్షకులకు ఇలాంటి టైప్ కథలు రుచించవు అని మన్మథుడు-2 రీసెంట్గా ప్రూవ్ చేసింది. సినిమా ఆడకపోవడం ఒక ఎత్తయితే, రివర్స్ లో విపరీతమైన ట్రోల్స్ చేయడం మరో ఎత్తు.
సదరు బాలీవుడ్ సినిమాను తెలుగులో తమ బ్యానర్ పైనే రీమేక్ చేయబోతున్నట్టు నిర్మాత, వెంకటేశ్ అన్నయ్య సురేశ్ బాబు ఇప్పటికే అధికారికంగా ప్రకంటించేశారు కూడా. అందులో వెంకటేశ్ హీరో అని కూడా ప్రకటన వచ్చేసింది. కానీ ఇప్పుడు వెంకీ ఈ సినిమా చెయ్యాలా, వద్దా అనే అనుమానాల్లో పడ్డట్టు సమాచారం. బావ నాగార్జునకు జరిగిన ఘోరపరాభవం తనకూ అవసరమా అని ఆలోచిస్తున్నాడట. మరోవైపు దే దే ప్యార్ దే సినిమాకు అవసరమైన తెలుగు నేటివిటీ జోడిస్తూ స్క్రిప్టులో మార్పులు చేసి దర్శకుడు శ్రీవాస్ షూటింగ్ కి రెడీగా ఉన్నాడు. ఈ సినిమా ఉంటుందా, లేదా? ఉంటే హీరోగా వెంకటేశ్ చేస్తారా లేక మరో హీరో ఎవరైనా తనని రీప్లేస్ చేస్తారా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చెయ్యాల్సిందే