జబర్దస్త్ కామెడీ షో తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బ్యూటీ అనసూయ. ఓవైపు బుల్లితెరపై మెప్పిస్తూనే వెండితెరపై కూడా మెరుస్తోంది. ప్రస్తుతం అనసూయ అశ్విన్ విరాజ్ కలిసి థాంక్ యూ బ్రదర్ అనే సినిమా చేస్తోంది. నూతన దర్శకుడు రమేష్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. జస్ట్ ఆర్డినరీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై మాగుంట శరత్ చంద్రారెడ్డి, తారక్ నాథ్ రెడ్డి, సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఇదిలా ఉండగా తాజాగా ఈ చిత్ర ట్రైలర్ ను విక్టరీ వెంకటేష్ విడుదల చేశారు. టైటిల్ తో పాటు ట్రైలర్ కూడా ఆసక్తిగా ఉందని వెంకటేష్ అన్నారు. సినిమాలో హీరో, హీరోయిన్ గెటప్స్ చాలా ఆసక్తి గా ఉన్నాయని అన్నారు. ఇందులో ఇద్దరు వ్యక్తులు లిఫ్ట్ లో చిక్కుకుపోయిన తరువాత ఏమౌతుంది అనే కాన్సెప్ట్ తో ఈ సినిమా తీశారని వెంకటేష్ కొనియాడారు.