ప్రస్తుతం వెంకీ మామ సినిమా చేస్తున్న వెంకటేష్, అసురన్ మూవీని రీమేక్ చేయడానికి రెడీ అయ్యాడు. సురేష్ ప్రొడక్షన్, కలైపులి థాను కలిసి నిర్మించనున్న ఈ సినిమా అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. దర్శకుడు ఎవరు? మంజు వారియర్ స్థానంలో ఎవరు నటిస్తారు? లాంటి వివరాలు తెలియాల్సింది. అయితే ఇదే సినిమాని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోగా నటిస్తాడని, రీమేక్ రైట్స్ కూడా తీసుకున్నాడని వార్తలు వచ్చాయి. చరణ్ నుంచి మరో రంగస్థలం రాబోతుందని మెగా అభిమానులు భావించారు. సురేష్ బాబు చేసిన అనౌన్స్మెంట్ వీరికి షాక్ ఇచ్చింది.
నిజానికి అసురన్ సినిమా రామ్ చరణ్ కి సెట్ అయ్యే కథ కాదు. అది ముగ్గురు పిల్లల తండ్రి, తన భూమి కోసం కుటుంబం కోసం చేసిన ఒక పోరాటం. రంగస్థలం సినిమాలో గ్రామస్థుడిగా కనిపించిన మెప్పించిన తర్వాత చరణ్, అసురన్ సినిమా ఇంపాక్ట్ పెద్దగా ఉండదు. రంగస్థలం సినిమా పల్లెటూరిలో తెరకెక్కినా కూడా అది కమర్షియలైజ్ చేసిన చిత్రం, అసురన్ అలా కాదు రా అండ్ రగ్గడ్ సినిమా. ధనుష్ శివ సామి పాత్రకి ప్రాణం పోశాడు, తెరపై అతన్ని చూస్తుంటే హీరో అనే ఫీల్ రాకుండా క్యారెక్టర్ మాత్రమే కనిపిస్తుంది. ఒక నటుడికి అదే అతిపెద్ద సవాల్, దాన్ని ఎన్నో సార్లు శ్వీకరించి తాను ఎంత మంచి నటుడినో ధనుష్ గతంలోనే ప్రూవ్ చేస్తూ, ఆడుకలం సినిమాతో నేషనల్ అవార్డు కూడా అందుకున్నాడు. ఇప్పుడు అసురన్ సినిమాకి కూడా ధనుష్ కి నేషనల్ అవార్డు వస్తుందని అన్ని వర్గాల ప్రేక్షకులు, సినీ వర్గాలు కూడా కాంప్లిమెంట్స్ అందిస్తున్నారు అంటే శివసామి పాత్రలో ధనుష్ ఎంతలా నటించి మెప్పించాడో అర్ధం చేసుకోవచ్చు.
ధనుష్ తో పాటు దర్శకుడు వెట్రిమారన్ సినిమాటిక్ బ్రిలియన్స్ అసురన్ సినిమాలో అడుగడునా కనిపిస్తూనే ఉంది, ఏ దర్శకుడికైనా దాన్ని బాలన్స్ చేయడం అంత ఈజీగా కాదు. వెంకటేశ్ యాక్టింగ్ గురించి మనకి ఆల్రెడీ తెలుసు కాబట్టి ధనుష్ చేసిన శివసామి పాత్రకి కంప్లీట్ గా న్యాయం చేయగలడు. మరి అసురన్ సినిమాకి వెట్రిమారన్ లోటుని ఎవరు భర్తీ చేస్తారు? ఎలా ఆ ఎమోషన్స్ కి, యాక్షన్ ఎపిసోడ్స్ కి బాలన్స్ చేస్తాడు అనేది చూడాలి.