టాలీవుడ్ లో దాదాపు అందరి స్టార్ హీరోల భార్యల గురించి చర్చలు జరుగుతూ ఉంటాయి. అప్పుడు ఎన్టీఆర్, అక్కినేని, కృష్ణ నుంచి ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, రామ్ చరణ్ వరకు వారి భార్యల గురించి ఏదొకటి సోషల్ మీడియాలో చూస్తూనే ఉంటాం. సినిమా కార్యక్రమాలకు, విహారయాత్రలకు వెళ్లి సోషల్ మీడియాలో సందడి చేయడం మనం చూస్తూనే ఉంటాం.
అయితే వెంకటేష్ భార్య నీరజ గురించి మాత్రం ఎక్కడా ఏ కామెంట్ ఉండదు. ఆమె ఏం చేస్తారు…? ఎక్కడ ఉంటారు..? వెంకటేష్ పిల్లలు ఏం చదువుతారు…? ఇవేమీ కూడా సోషల్ మీడియాలో ఉండవు. ఎందుకు వెంకటేష్ దూరంగా ఉంటారో చూద్దాం. అనవసరమైన పాపులారిటీ తనకు అవసరం లేదని, తన బిడ్డల గురించి, భార్య గురించి అనవసర చర్చ మీడియాలో అభిమానుల్లో వద్దని అంటారట.
కుమార్తె వివాహం అయినా సరే ఆమె ఫోటోలు కూడా సోషల్ మీడియాలో రాలేదు. తక్కువ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. నీరజ ఫోటోలు గూగుల్ లో వెతికినా పెద్దగా ఉండవు. సినిమా కార్యక్రమాలకే కాదు ఇతర హీరోల ఇళ్ళకు ఫంక్షన్లకు కూడా ఆమె పెద్దగా వెళ్ళడం ఉండదు. వెంకటేష్ కూడా తన పని తాను చేసుకోవడమే గాని అనవసరమైన విషయాల్లో ఉండరు. సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా సరే ఆయన మాట వినపడదు.