వెంకీ మామ హంగామా - Tolivelugu

వెంకీ మామ హంగామా

వెంకీ మామ సరదా హంగామా పోస్టర్ లుక్ దసరా బహుమతిగా ఫాన్స్ ముందుకు వచ్చింది. పల్లె సరదాగా ట్రాక్టర్ పై మామా అల్లుళ్ళు విక్ట‌రీ వెంక‌టేశ్‌, యువ సామ్రాట్ నాగ‌చైత‌న్య,  సరిజోడీ భామలు పాయల్ రాజ్ పుత్, రాశీఖన్నాతో విహారం సీన్ కనువిందుగా ఉంది.

Venky Mama Dasara Poster, వెంకీ మామ హంగామా విక్ట‌రీ వెంక‌టేశ్‌, యువ సామ్రాట్ నాగ‌చైత‌న్య హీరోలుగా కె.ఎస్‌.ర‌వీంద్ర‌(బాబీ) ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న  వెంకీమామ‌ ఫాన్స్ ను ఖుషీ చేసేందుకు రెడీ అవుతోంది.  సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌, పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ బేనర్లపై  సురేష్ బాబు, టీజీ విశ్వ‌ప్ర‌సాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా తొలి సంగ్రహం వ్యూ విజ‌య‌ద‌శ‌మి సంద‌ర్భంగా వస్తున్ననేపధ్యంలో పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు.

ఈ మూవీకి సంబంధించి ప్రస్తుతం రామోజీ ఫిలింసిటీలో వేసిన ఓ భారీ సెట్‌లో పాట చిత్రీక‌ర‌ణ‌ జ‌రుగుతోంది.

Share on facebook
Share on twitter
Share on whatsapp