వెంకీమామ సినిమాకు ఫైనల్‌గా రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. ఇన్నాళ్లు సస్పెన్స్‌లో ఉంచిన వెంకీ మామా రిలీజ్ డేట్‌ను సురేష్ బాబు టీంతో రివీల్ చేశాడట. తను ఫారిన్ టూర్ వెళ్తూ… వెంకీమామ సినిమా డిసెంబర్ 13న ఫిక్స్ చేద్దాం అని చెప్పారట.
దాంతో ఇన్నాళ్లు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వెంకీమామకు ముహుర్తం పెట్టాశారు. ఈ సినిమాలో వెంకీ అల్లుడు నాగచైతన్య కూడా కీ రోల్ పోషిస్తున్నాడు.
అయితే, డిసెంబర్ 13నే ఎందుకు రిలీజ్ చేస్తున్నట్లు అని ఆరా తీస్తే… అదే రోజు విక్టరీ వెంకటేష్ బర్త్ డే. సో బర్డ్ డే సందర్భంగా శుక్రవారం నాడు సినిమా రిలీజ్ చేయబోతున్నారు.