నిజజీవితంలో మామా అల్లుళ్ళయిన విక్టరీ వెంకటేష్, నాగ్ చైతన్య… వెండితెరపైనా సేమ్ టు సేమ్ వెంకీమామ మూవీలో సందడికి రెడీ అయ్యారు. రియల్ లైఫ్ ఎఫెక్షన్ కాగా రీల్ లైఫ్ రియాక్షన్. అంటే నిజజీవితంలో ఆత్మీయత, అభిమానం కాగా సినిమాలో ఎందుకో ఏమో కానీ మామకు అల్లుడంటే దడ..!
మూవీ అంటేనే లాజిక్…మేజిక్. వెంకీమామలో వెంకటేష్ జాతకాల పిచ్చి చాదస్తం ఎక్కువట. కంసుడికి అల్లుడు శ్రీ కృష్ణుడి వల్ల ప్రాణ గండం ఉన్నట్లు వెంకీమామ మూవీలోనూ కామన్ డేంజర్ ఉందట. జాతక రీత్యా అలా రాసి ఉండటంతో కంసుడు తోబుట్టువుకు పుట్టిన పిల్లల్ని పురిట్లోనే సంహరిస్తూ మాయోపాయంతో తప్పించుకున్న శ్రీ కృష్ణుడి చేతిలో హతమయ్యాడు.
వెంకీమామలో మాత్రం ఎస్కేప్ అయిన అల్లుడి వల్ల ఎఫెక్ట్ లేకుండా జాతకాలు చూసుకుంటూ ఎస్కేప్ అయ్యే సీన్స్ కామెడీ ఎట్రాక్షన్. పల్లెటూరి మామ…మిలటరీ అల్లుడి హంగామా భలే ఉంటుందట.
ఇక మూవీ లోకేషన్లలో చాలా సందడిగా ఉంది. వెంకటేష్, పాయల్ రాజపుత్, నాగ చైతన్య, రాశీఖన్నా జోడీలతో డైరెక్టర్ బాబీ భలే ఫామిలీ డ్రామా క్రియేట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇక వెంకటేష్ మూవీలో ఎవరైనా ఒక్కసారి పనిచేస్తే ఆయన ఫాన్ కావాల్సిందే. అలాగే రాశీఖన్నా వెంకి క్రమశిక్షణకు ఫిదా అయింది. వ్యక్తిగత ఆలోచనా విధానం చూసి స్ఫూర్తి ప్రదాత అంటోంది. టోటల్ గా రాశీఖన్నా వెంకీ ఫాన్ అయింది.