టాలీవుడ్ లో ఉన్న ప్రముఖ కమెడియన్స్ లో వెన్నెల కిషోర్ ఒకడు. ఆయన గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంటున్నాడు. ఆయన డేట్స్ దొరకడం కూడా కష్టంగా మారింది. ప్రస్తుతం వెన్నెల కిషోర్ కి సంబంధించి ఓ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
టాప్ ఇండియా డైరెక్టర్ శంకర్ దర్మకత్వం చేస్తున్న ‘ఇండియన్-2’లో వెన్నెల కిషోర్ నటిస్తున్నట్టు కొన్ని రోజులుగా వార్తలు గుప్పుమన్నాయి. ఇందులో నెగెటివ్ షేడ్ లో కనిపించనున్నాడని ప్రచారం జరుగుతోంది. రేపో మాపో ఈ సినిమా షూటింగులో పాల్గొంటాడనే టాక్ వినిపిస్తోంది.
అటు ‘ఇండియన్-2’ షూటింగ్ కూడా చకచకా జరుగుతోంది. లైకా – రెడ్ జెయింట్ సంస్ధలు కలిసి ఈ సినిమాను భారీ బాడ్జెట్ తో నిర్మిస్తున్నాయి. కాజల్, రకుల్ ముఖ్యమైన పాత్రలను పోషిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఈ విషయంపై వెన్నెల కిషోర్ స్పందించాడు. ఈ సినిమాలో తాను కూడా భాగమైనట్టుగా వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని చెప్పాడు. ‘ఇండియన్-2’లో గానీ, ‘పాకిస్థాన్-3’లో గాని నటించడంలేదంటూ ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు. దీంతో ఈ ప్రచారాలకు ఫుల్ స్టాప్ పడినట్టైంది.