జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇవ్వకముందు సుడిగాలి సుధీర్, ఆటో రామ్ ప్రసాద్ , గెటప్ శ్రీనులు ఎలా ఉండేవారోనని అందరు ఆసక్తిగా చర్చిస్తుంటారు. మ్యాజిక్ షో చేస్తూ సుధీర్, రైటర్ గా రామ్ ప్రసాద్ , ఎక్కడో ఉన్న గెటప్ శ్రీనులు జబర్దస్త్ కామెడీ షోలోకి ఎంట్రీ ఇవ్వడంతో వారి దశ పూర్తిగా మారిపోయింది. వీరికి వేణు తన టీమ్ లో అవకాశం ఇచ్చి వారిని ప్రోత్సహించాడు. ఆ తరువాత సుధీర్ టీమ్ లీడర్ స్థాయికి ఎదిగాడు. ఇక ఈ టీమ్ లో రామ్ ప్రసాద్ తనదైన ఆటో పంచులతో నవ్విస్తుండగా… గెటప్ శ్రీను తన డైలాగ్ డెలివరీతో, తన వేషధారణతో ఎంటర్ టైన్ చేస్తుంటాడు. మొత్తానికి ఈ టీమ్ జబర్దస్త్ లోనే క్రేజీ టీమ్ గా పేరొందింది. సుడిగాలి సుధీర్ మల్టి టాలెంటెడ్ కావడంతో .. అతనికి మంచి ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. ఒక్క జబర్దస్త్ కామెడీషోనే కాకుండా, డీ జోడీలో, పోవే పోరాలో మనోడి ఫెర్మామెన్స్ అదరహో అనిపిస్తుంటుంది.
ఇక సుధీర్ ఇప్పటికే సాఫ్ట్ వేర్ సుధీర్ సినిమాతో హీరోగా కూడా ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది. తాజాగా సుధీర్, ఆటో రామ్ ప్రసాద్, గెటప్ శ్రీను ప్రధాన పాత్ర పోషిస్తోన్న త్రీ మంకీస్ చిత్రం శుక్రవారం విడుదలైంది. ఇదిలా ఉండగా.. ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకలో వేణు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసాడు. నేను పరిచయం చేసిన ఈ ముగ్గురు కోతులు సినిమా చేస్తుండటం ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు. అదే సమయంలో గర్వంగా ఉందన్నారు. తాను తీసుకొచ్చిన ఈ ముగ్గురు వారి,వారి టాలెంట్ తోనే ప్రపంచానికి పరిచయం అయ్యారని తెలిపారు. వారు ఇంతలా ఎదిగినందుకు సంతోషంగా ఉన్నప్పటికీ లోలోపల ఇగో కూడా ఉందన్నారు. ఇంతా ఎదుగుతారని ముందే తెలిసి ఉంటే అప్పుడే తొక్కేసేవాణ్ని కదా అంటూ సరదాగా వ్యాఖ్యానించాడు. తాజాగా వేణు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ ఆవుతోన్నాయి.