వేణు శ్రీరామ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా ఐకాన్ సినిమాలో ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాను ప్రముఖ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్నట్టు కూడా ప్రకటించారు. కానీ ఏమైందో తెలియదు కానీ ఆ సినిమా అలా ఆగిపోయింది. ఆ తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ అల వైకుంఠ పురం లో సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
అయితే ఈ సినిమా ఆగిపోలేదని ఈ సినిమా విషయమై బన్నీతో టచ్ లోనే ఉన్నాను అని దర్శకుడు వేణు శ్రీరామ్ తెలిపారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఐకాన్ సినిమా గురించి చెప్పుకొచ్చారు. ఈ సినిమా ప్రాజెక్టు ఇంకా ఆగలేదని కచ్చితంగా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తానని తెలిపాడు.
ఇక ప్రస్తుతం బన్నీ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా చేస్తున్నాడు. దీని తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమాకు కమిట్ అయ్యాడు. ఈ సినిమా తరువాత ఐకాన్ సినిమాను పట్టాలెక్కించి అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుతం వేణు శ్రీరామ్ పవన్ హీరోగా వస్తున్న వకీల్ సాబ్ సినిమా చేస్తున్నాడు.