ఈ మధ్య కాలంలో ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి చెప్తున్న జాతకాలు కాస్త సంచలనంగా మారుతున్నాయి. తాజాగా ఆయన చేసిన కొన్ని కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాను కాసినో ఆడనని అయితే మూహూర్తాలు పెడతానని అన్నారు. తాను ఎయిర్ పోర్ట్ కు వెళితే ప్రోటోకాల్ ఉంటుందని చెప్పుకొచ్చారు. 500 రూపాయలు ఇస్తే హైదరాబాద్ లో ఎవరికైనా ప్రోటోకాల్ ఇస్తారని వివరించారు.
తనకు ఏపీ ప్రభుత్వం ప్రోటోకాల్ ఇస్తుందని తెలిపారు. తన దగ్గర చెక్ ఇన్ లగేజ్ ఉండదని తాను విమానశ్రయానికి 45 నిమిషాల ముందుగా వెళ్తానని పేర్కొన్నారు. ప్రతి హీరో, ప్రతి హీరోయిన్ ప్రోటోకాల్ ఫాలో అవుతారని అన్నారు. కరోనా విజృంభణ తర్వాత తమ పక్కన ఎవరూ కూర్చోకుండా సీట్లు బుకింగ్ చేసుకుంటున్నారని తెలిపారు. 2027 – 2028లో టాలీవుడ్ ప్రముఖ హీరో, హీరోయిన్ కు ప్రాణ గండం ఉందని అన్నారు.
వాళ్లు యంగ్ అని వివరించారు. మంచి జ్యోతిష్కుడు దొరకడం కూడా జాతకమే అన్న ఆయన సంచలన వ్యాఖ్యలు చేసారు. చైసామ్ కలిసే ఛాన్స్ లేదని స్పష్టం చేసారు. ప్రభాస్ గారి పరిస్థితి నెగిటివ్ గా ఉందని ఆయన్స్ వ్యాఖ్యానించారు. ఆయనకు ఆరోగ్య ఇబ్బందులు తీవ్రంగా ఉన్నాయని వివరించారు. ప్రభాస్ కు అర్ధాష్టమ శని ప్రారంభం కానుందని వివరించారు. ప్రభాస్ సినిమాలు మరీ భారీ హిట్ కావని వివరించారు.