కొంతమంది మీడియాలో మాట్లాడే మాటలకు కాస్త హడావుడి ఎక్కువగా జరుగుతుంది. అందులో వేణు స్వామి ఒకరు. ప్రముఖ జ్యోతిష్యుడిగా ఆయనకు మంచి ఇమేజ్ ఉన్న సంగతి తెలిసిందే. దీనితో జనాలు కూడా ఆయన మాటలను వింటూ ఉంటారు. ఇటీవల మహేష్ బాబు కుటుంబంలో వరుస మరణాలకు సంబంధించి ఆయన చేసిన వ్యాఖ్యలు బాగా వైరల్ అయ్యాయి అనే చెప్పాలి.
ఇప్పుడు ప్రభాస్ జాతకం గురించి వేణు స్వామి కీలక వ్యాఖ్యలు చేసారు. వచ్చే ఏడాది ప్రభాస్ జాతకం ఏ మాత్రం బాగా లేదని ఆయన కామెంట్స్ చేసారు. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… వచ్చే ఏడాది నుంచి ప్రభాస్ ఆరోగ్య పరిస్థితులు దారుణంగా ఉన్నాయి అని అన్నారు. ప్రభాస్ జాతకరీత్యా ఆయనది వృశ్చిక రాశి అని చెప్పిన వేణు స్వామి… ప్రస్తుతానికి శని గురువు స్థానాలు మారుతున్నాయి అన్నారు.
దీంతో ఆయనకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. ఆయన అర్థాష్టమ శని, ఒకవైపు అష్టమ గురువు, ఒకవైపు షష్ఠమ గురువు మరోవైపు ఉండడంతో ఆయన అనేక సమస్యలను ఎదుర్కోబోతున్నారంటూ హెచ్చరించారు. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ కాస్త ఇబ్బంది పడుతున్నారు. రెండు సినిమాలు విడుదల అయినా సరే ఒక్క సినిమా కూడా హిట్ కాలేదు. ఈ తరుణంలో వేణు స్వామి చెప్పిన జాతకంపై చర్చ జరుగుతుంది.