వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడుతున్న మెగాస్టార్ చిరంజీవికి ఇప్పుడు వాల్తేరు వీరయ్య సినిమా మంచి బూస్ట్ ఇచ్చింది అనే చెప్పాలి. గాడ్ ఫాదర్, ఆచార్య సినిమాలు ఆయనను ఇబ్బంది పెట్టిన మాట వాస్తవం. ఇక వాల్తేరు వీరయ్య సినిమాలో చిరంజీవిలో గతంలో ఉన్న గ్రేస్ కనపడింది. ఇక ఆయన డాన్స్ కూడా చాలా బాగుంది అనే కామెంట్స్ వచ్చాయి. ఇక రవితేజా ఈ సినిమాకు ప్లస్ అయ్యారు.
ఈ సినిమా కోసం చిరంజీవి కాస్త బరువు కూడా తగ్గారనే టాక్ ఉంది. సినిమాలో హీరోయిన్ పక్కన చేసిన సన్నివేశాలు కూడా బాగున్నాయి. సినిమా వసూళ్ళ విషయానికి వస్తే ప్రపంచ వ్యాప్తంగా సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా ఇప్పటి వరకు 120 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇదిలా ఉంటే యువ దర్శకుడు బాబీకి ఈ సినిమా బాగా కలిసి వచ్చింది అనే టాక్ కూడా వినపడుతుంది.
అతని పని తీరు కూడా ఈ సినిమాలో చాలా బాగుంది అని సినిమా చూసిన వాళ్ళు అంటున్నారు. చిరంజీవిని ఫాన్స్ ఎలా కోరుకున్నారో అలాగే చూపించారని అంటున్నారు.దీనితో చిరంజీవి బాబీ విషయంలో చాలా సానుకూలంగా ఉన్నారట. బాబీకి ఒక భారీ గిఫ్ట్ కూడా ఇచ్చారట. అతన్ని పిలిచి రెండు కోట్ల ఖరీదు చేసే కారుని ఇచ్చారట. అలాగే మంచి విందు భోజనం కూడా బాబీ ఫ్యామిలీకి ఏర్పాటు చేసారు చిరంజీవి.