ప్రముఖ బాలీవుడ్ నటుడు అరుణ్ బాలి కన్నుమూశారు. 79 ఏళ్ల వయసులో ముంబైలోని ఆయన నివాసంలో తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా ఆయనకు ఆరోగ్యం బాగోకపోవడంతో చికిత్స పొందుతున్నారు.
ఆయన మస్తీనియా గ్రావిస్ అనే అరుదైన నాడీ కండరాల వ్యాధితో బాధపడుతున్నారు. బాలి మృతి పట్ల బాలీవడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
3 ఇడియట్స్, కేదార్‌నాథ్, పానిపట్ వంటి చిత్రాలలో అరుణ్ బాలి కీరోల్ ప్లే చేశారు. చివరగా ఆయన అమితాబ్ బచ్చన్ నటించిన గుడ్ బై చిత్రంలో నటించారు.
ఈ చిత్రం అక్టోబర్ 7న థియేటర్లలో విడుదలైంది. అరుణ్ బాలికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారిద్దరూ ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నారు. వారు ఇండియాకు వచ్చాక బాలి అంత్యక్రియలు జరగనున్నాయి.
Veteran actor Arun Bali passed away at the age of 79 years in Mumbai
(file photo) pic.twitter.com/z1BcEUYr4u
— ANI (@ANI) October 7, 2022