బాలీవుడ్ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు సమీర్ ఖాకర్ కన్నుమూశారు. 1980 కాలంలో దూరదర్శన్ హిట్ షోలో ఖోప్డి అనే ప్రముఖ పాత్రకు పేరుగాంచిన సమీర్ ఖాఖర్ ముంబైలో కన్నుమూశారు. మల్టీ ఆర్గాన్స్ వైఫల్యం కారణంగా బుధవారం ముంబైలోని బోరివలిలోని ఎంఎం ఆసుపత్రిలో సమీర్ మరణించినట్లు అతని తమ్ముడు గణేష్ ఖాకర్ తెలిపారు.
“అతనికి నిన్నటి నుండి శ్వాసకోశ సమస్యలు ఉన్నాయి. తరువాత అతను అపస్మారక స్థితిలోకి వెళ్ళాడు. బుధవారం తెల్లవారుజామున 4.30 గంటలకు తుదిశ్వాస విడిచాడు” అని అతని తమ్ముడు తెలిపారు. దాదాపు నాలుగు దశాబ్దాల పాటు ప్రముఖ రంగస్థల, చలనచిత్ర, టీవీ నటుడిగా సమీర్ గుర్తింపు తెచ్చుకున్నారు. సమీర్‌కు 71 ఏళ్లు. అయితే చాలా కాలంగా సమీర్ నటనకు దూరంగా ఉన్నాడు.
1996లో యూఎస్‌ఏలో స్థిరపడిన తర్వాత సమీర్ తిరిగి భారత్ వచ్చాడు. అతని చివరి చిత్రం ‘జై హో’, అతను చివరిసారిగా ‘సంజీవని’ అనే టీవీ షోలో కూడా కనిపించాడు. సమీర్ గుజరాతీ నాటకాలతో ప్రారంభించాడు. టీవీ షో, నుక్కడ్‌తో ఖ్యాతిని పొందాడు. ఈ ఐకానిక్ షో అతన్ని ప్రముఖ క్యారెక్టర్ యాక్టర్‌గా మార్చింది. సమీర్ యొక్క ప్రసిద్ధ టీవీ షోలు సర్కస్, నయా నుక్కడ్, శ్రీమాన్ శ్రీమతి, మణిరంజన్. అదాలత్. అతను హసీ టు ఫేసీ, పటేల్ కో పంజాబీ షాదీ, పుష్పక్, పరిందా, షాహెన్‌షా వంటి చిత్రాలలో కనిపించాడు.
సమీర్ ఖాకర్ అంత్యక్రియలు బోరివాలిలోని బాబాయ్ నాకా శ్మశానవాటికలో జరగనున్నాయి. అతడికి భార్య ఉంది. ఇటీవల సమీర్ అమెజాన్ ప్రైమ్ వీడియో ఫర్జీ, జీ5కి చెందిన సన్‌ఫ్లవర్, సుధీర్ మిశ్రా ‘సీరియస్ మెన్’ వెబ్ సిరీస్‌లలో కనిపించాడు.