బాలీవుడ్ సీనియర్ నటి, రచయిత లలిత లాజ్మీ(90) కన్ను మూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె, సోమవారం రాత్రి ఇంట్లోనే చనిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. లలిత బాలీవుడ్ లెజండరీ హీరో గురుదత్ సోదరి.
హిందీలో ఎన్నో చిత్రాల్లో నటించిన లలిత.. ‘తారే జమీన్ పర్’ సినిమాలో ఆర్ట్ టీచర్ గా కనిపించారు. ఆమె మృతి వార్తను జహంగీర్ నికల్సన్ ఆర్ట్ ఫౌండేషన్ సోషల్ మీడియాలో షేర్ చేసింది.
లలిత చిత్రలేఖనంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని, దేశంలో ప్రసిద్ధ కళాకారుల్లో ఒకరిగా ఎదిగారు. తాను వేసిన పెయింటింగ్స్ ఇంటర్నేషనల్ ఆర్ట్ గ్యాలరీల్లో ఎగ్జిబిట్ చేశారు.
సెల్ఫ్ థాట్ ఆర్టిస్ట్ అయిన లలిత లాజ్మీ అనేక రచనలు కూడా చేశారు. ఆమె మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.