రాష్ట్రంలో నియంత పాలన సాగుతోందని కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు ఆరోపించారు. బడుగు బలహీన వర్గాల ప్రజలపైన ఆధిపత్యం కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. ప్రజల పక్షాన మాట్లాడినందుకు ఒక బీసీ సర్పంచ్ ని పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి సస్పెండ్ చేయించారని ఆయన ఆరోపించారు. ఒక దగ్గర నామినేషన్లు చింపేశారు.
ఇక్కడ ఓ బీసీ సర్పంచ్ ను సస్పెండ్ చేశారు. ఇగ రాష్ట్రంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి విలువెక్కడుందని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్.. నువ్ చేస్తున్న దౌర్జన్యాలను ప్రజలు గమనిస్తున్నారు. 2023 లో నీకు కచ్చితంగా గుణపాఠం చెప్తారని హెచ్చరించారు.