గన్ పార్క్ వద్ద కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీహెచ్ మౌన దీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పంజాగుట్టలో అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
అంబేడ్కర్ విగ్రహాన్ని పోలీసులు కిడ్నాప్ చేసి పోలీస్ స్టేషన్ లో ఉంచారని ఆరోపించారు. బీజేపీ నాయకులు అంబేడ్కర్ విగ్రహం గురించి ఎందుకు మాట్లాడరు. అంబేడ్కర్ రాజ్యాంగంలో ఆర్టికల్ 3 లేకపోతే ఎన్ని త్యాగాలు చేసినా తెలంగాణ వచ్చేది కాదని అన్నారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం పక్కనే అంబేడ్కర్ విగ్రహం పెడితే తప్పేంటని నిలదీశారు. ఈటల రాజేందర్ ఈ విషయాన్ని ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. అసెంబ్లీలో అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటుపై నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు.
లేదంటే గ్రామగ్రామాన తిరిగి అంబేడ్కర్ విగ్రహాన్ని జైలులో పెట్టిన విషయాన్ని ప్రజలకు తెలియజేస్తానని హెచ్చరించారు. ఓవైసీ, జై భీం నినాదాలు మాత్రం చేస్తాడని అన్నారు. దళితుల సమస్యలపై ఎందుకు స్పందించట్లేదని ప్రశ్నించారు వీహెచ్.